భూ వివాదంలో కన్నడ నటుడు యష్ ఫ్యామిలి

1243

ప్రముఖ కన్నడ నటుడు యష్ భూ వివాదంలో చిక్కుకున్నారు. యష్ సొంతగ్రామంలో కొనుగోలు చేసిన భూమి చుట్టూ కంచె వేస్తున్న సమయంలో యష్ తల్లి పుష్పలతకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది.. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. వివరాల్లోకి వెళితే యష్ తల్లి స్వగ్రామం కర్ణాటకలోని హాసన్ జిల్లా.. వీరికి ఇక్కడ ఓ ఇల్లు ఉంది. హాసన్ కు సమీపంలోని తిమ్మాపుర గ్రామంలో యష్ 80 ఎకరాల సేద్యపు భూమిని కొనుగోలు చేశారు.

దీని చుట్టూ పెన్సింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను పరిశీలించేందుకు యష్ తల్లి పుష్పలత తిమ్మాపుర వెళ్లారు. అయితే 80 ఎకరాలకు చుట్టూ పెన్సింగ్ వేస్తె కింద పొలాలు ఉన్నవారు పొయ్యేందుకు వీలుండదు. తమకు దారి ఇచ్చిన తర్వాత ఫెన్సింగ్ వేసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులకు యష్ తల్లికి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఈ 80 ఎకరాలలోంచి కిందకు వెళ్లేందుకు గతంలో రోడ్డు మార్గం ఉంది.

ఫెన్సింగ్ వేస్తె ఆ దారి లోంచి కిందకు వెళ్లేందుకు విలుకాదు.. ఇదే విషయం అనేక సార్లు చెప్పారు గ్రామస్తులు. అయినా వినిపించుకోకుండా పనులు చేస్తుండటంతో వారిని అడ్డుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులకు విషయం తెలిపారు. అయితే ఇదే విషయంపై మంగళవారం యష్ తిమ్మాపురకు వెళ్లారు. అక్కడ పోలీసుల సమక్షంలో గ్రామస్తులతో చర్చించారు. చర్చలు కొలిక్కిరాకపోవడంతో ఆయన వెళ్లిపోయారు.

వెళ్తున్న సమయంలో యష్ కారును అడ్డుకున్నారు గ్రామస్తులు ఈ సమయంలో యష్ కు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. తనది ఇదే ప్రాంతమని పేద ప్రజలకు ఏదైనా మేలు చెయ్యాలనే ఉద్దేశంతో ఈ భూమి కొన్నానని, ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మాణాలు చేపట్టాలనుకున్నానని కానీ అవేవి అర్ధం చేసుకోకుండా తమను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు యష్.. ఇక ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే గ్రామస్తులతో చర్చిస్తున్నారు.

భూ వివాదంలో కన్నడ నటుడు యష్ ఫ్యామిలి