సినీనటి జయశ్రీ రామయ్య ఆత్మహత్య!

320

కన్నడ బిగ్ బాస్-3 కంటెస్టెంట్, నటి జయశ్రీ రామయ్య సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె కొంతకాలంగా నిరాశతో ఉన్నారు. దీంతో బెంగళూరుకు చెందిన సంధ్య కిరణ ఆశ్రమంలో కౌన్స లింగ్ తీసుకుంటున్నారు.. అయితే అక్కడ ఆమె ఉరివేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి పంపారు, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

జయశ్రీ రామయ్య బిగ్ బాస్ కన్నడ సీజన్ 3 లో పోటీదారుగా ఉన్నారు. చాలా మంది పాల్గొన్న వారిలా కాకుండా, బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేసిన తర్వాత కూడా జయశ్రీకి సినిమా అవకాశాలు రాకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యారు. అవకాశాలు లేకపోవడం పట్ల అసంతృప్తికి లోనైన జయశ్రీ గతేడాది పేస్ బుక్ పోస్టులో ‘నేను ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తున్నాను’ అని పోస్ట్ చేసి.. ఆ తరువాత కొద్దిసేపటికే ఆ పోస్టు డిలీట్ చేసి.. ‘ మీ అందరిపై అభిమానంతో నేను సేఫ్ అంటూ మరొక పోస్టు పెట్టారు. కాగా 2017 లో ఉప్పు హులీ ఖారా చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు.