మొన్న తలైవి.. నేడు ఇందిర.. కంగనా గట్స్ వాహ్!

446

నిజజీవితంలో ప్రజలతో మమేకమైన మొహాలు అంత త్వరగా మర్చిపోలేం. అందునా పొలిటికల్, సినిమా ఫీల్డ్ లోని వారైతే తరాలు మారినా వారి క్రేజ్ అలానే కొనసాగుతూ ఉంటుంది. అలనాటి నటి సావిత్రి అంటే సినీ అభిమానులకు ఎనలేని ప్రేమ. మరి అలాంటి సావిత్రి పాత్రలో నటించాలంటే ముందు గట్స్ ఉండాలి. తర్వాత మోము.. ముఖకవళికలతో మెప్పించాలి. మహానటి సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి నటనా గొప్పదనాన్ని రంగరించి మైమరిపించింది. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పొలిటికల్ లీడర్స్ పాత్రలలో ట్రై చేస్తుంది.

కంగనా ఇప్పటికే తమిళనాడు మాజీ సీఎం, ఒకప్పటి నటి జయలలిత పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే తలైవి సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్లు ప్రచార చిత్రాల్లో కంగనా అచ్చుగుద్దినట్లు జయలలితను దింపేసింది అనే టాక్ వచ్చేసింది. ఇక సినిమా రిలీజ్ అయితే కానీ కంగనాకు ఎన్ని మార్కులు పడతాయో తెలియదు. అయితే.. ఆ సినిమా రిలీజ్ కాకుండానే కంగనా మరో డేరింగ్ పాత్రకు సిద్ధమైంది.

ఇండియన్ గ్రేట్ లీడర్, పొలిటీషియన్, మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా కనిపించబోతున్నట్లు కంగనా ప్రకటించింది. అయితే.. ఇది ఇందిరా గాంధీ బయోపిక్ మాత్రం కాదట. రాజకీయ చరిత్ర, పొలిటికల్ డ్రామాగా మీ ముందుకు రాబోతున్న ఈ సినిమాలో పవర్‌ఫుల్ లేడీ ఇందిరా గాంధీ పాత్రతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి, సంజయ్ గాంధీల పాత్రలు కూడా కనిపిస్తాయని కంగనా చెప్పడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. సినిమా ఎలా ఉంటుంది.. ఇందిర పాత్ర అంటే ఏమైనా కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయా.. కంగనా ఈ పాత్రను ఎలా డీల్ చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.

మొన్న తలైవి.. నేడు ఇందిర.. కంగనా గట్స్ వాహ్!