కంగనా కేసు.. హృతిక్ కు పోలీస్ నోటీసులు!

256

బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కు ముంబై క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు సమన్లు జారీ చేశారు. హృతిక్ గతంలో హీరోయిన్ కంగనా రనౌత్​పై నకిలీ ఈ-మెయిల్​ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కంగన నకిలీ ఈ మెయిల్ ఖాతా నుంచి తనకు బెదిరింపు మెయిళ్లొచ్చాయని 2016లో హృతిక్​ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ సమయంలో కంగన, హృతిక్​ మధ్య వివాదం చెలరేగింది. ఒకరికొకరు లీగల్​ నోటీసులిచ్చుకున్నారు. ఈ కేసులోనే ఇప్పుడు హృతిక్ కు​ నోటీసులు అందించగా ఫిబ్రవరి 27న హృతిక్​ వాంగ్మూలాన్ని స్వీకరించనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబరులో హృతిక్ న్యాయవాది అభ్యర్థన మేరకు ఈ కేసును సైబర్​ విభాగం నుంచి నేర విభాగానికి ముంబయి పోలీసులు బదిలీ చేయగా ఇప్పుడు ముమ్మర దర్యాప్తు జరుగుతుంది.

హృతిక్​, తనకు మధ్య ప్రేమయాణం నడిచినట్లు కంగన అప్పట్లో బహిరంగంగానే చాలా సార్లు చెప్పింది. ప్రేమ పేరుతో నమ్మించి తనను మోసం చేశాడని కంగనా పలుసార్లు విమర్శించింది. ఇదిలా ఉండగా కంగన పేరుతో నకిలీ మెయిల్​ ఖాతా నుంచి తనకు వందల కొద్దీ మెసేజ్​లు, మెయిల్స్​ వస్తున్నాయని హృతిక్ సైబర్​ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు అప్పటి నుంచి ఆ కేసును దర్యాప్తు చేస్తుండగా ఈ సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం దీనిని క్రైమ్​ బ్రాంచ్​కు తరలించగా ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు.

కంగనా కేసు.. హృతిక్ కు పోలీస్ నోటీసులు!