Kamal Hasan: ప్రచార బరిలోకి లోకనాయకుడు!

226

Kamal Hasan: దేశంలో ఎన్నికల నగారా మ్రోగిన సంగతి తెలిసిందే. మొత్తం 5 రాష్ట్రాలలో ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తుండగా పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే పాతుకుపోయిన రాజకీయ పార్టీలతో కొత్త కొత్త వ్యక్తులు కూడా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో తమిళనాడులో నటుడు కమల్ హాసన్ కూడా ఒకరు. కమల్ రాజకీయ ప్రయాణం గతేడాదే మొదలు పెట్టగా ఇప్పుడు ఈ ఎన్నికలకు ఎత్తులు సిద్ధం చేసుకుంటున్నారు. మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్ఎం) పార్టీని స్థాపించిన కమల హాసన్ ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు.

మార్చి 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తామని కమల్ వెల్లడించారు. ప్రస్తుతం పొత్తులపై ఇతర పార్టీలతో చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపిన కమల్ పొత్తులు ఖరారు అయ్యాక స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఎంఎన్ఎం పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 7న విడుదల చేస్తామని కమల్ తెలిపారు. నెలరోజుల పాటు రాష్ట్రాన్ని చుట్టేందుకు లోకనాయకుడు సిద్దమవగా మరోవైపు మిగతా రాజకీయ పార్టీలు ప్రచార అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఏప్రిల్ 6న తమిళనాడులో ఎన్నికలు జరగనుండడంతో మొత్తంగా నెల రోజుల పాటు హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నాయి.

Kamal Hasan: ప్రచార బరిలోకి లోకనాయకుడు!