కమల్ ఒంటరి పోరు.. 154 స్థానాల్లో అభ్యర్థులు

402

విలక్షణ నటుడు కమల్ హాసన్ పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్న కమల్ మొదటి సారి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. ఇక ఇప్పటికే ఏఐడీఎంకే, డీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ సీట్ల పంపకం పూర్తీ చేశాయి. ఇక 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 154 స్థానాల్లో మక్కల్‌ నీది మయ్యం బరిలో దిగనున్నట్లు కమల్‌ పేర్కొన్నారు. కూటమిలో భాగస్వాములైన ఆలిండియా సమతువ మక్కల్‌ కచ్చి, ఇందియా జననాయగ కచ్చికి 80 స్థానాలను కేటాయించినట్లు పేర్కొన్నారు. రెండు పార్టీలో చెరో 40 స్థానాల్లో పోటీ చేస్తాయని తెలిపారు. పార్టీ అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థను ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

కమల్ ఒంటరి పోరు.. 154 స్థానాల్లో అభ్యర్థులు