కమల్ పార్టీతో ఎంఐఎం దోస్తీ!

145

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి, మే మధ్యలో ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇక ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీలైన ఏఐడీఎంకే, డీఎంకే నేతలు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఇక మరోవైపు సినీ హీరోలు కమల్, రజినీకాంత్ ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. మక్కల్‌ నీది మయ్యం పార్టీ, ఎంఐఎం కలిసి ఎన్నికలకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తో ఎంఐఎం చీఫ్ ఒవైసి జనవరి చివర్లో భేటీ కానున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరితే కలిసి ఎన్నికలకు వెళ్తారు, లేదంటే సింగల్ గా బరిలోకి దిగుతారు.

ఇక ఇప్పటికే బీహార్, గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి ఊపుమీదున్న ఎంఐఎం పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తహతహలాడుతోంది. పొత్తులేకపోయిన సొంతంగా బరిలో దిగేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ వర్గాల నుంచి సమాచారం లేకపోయిన, దేశ వ్యాప్తంగా తమ పార్టీ విస్తరణలో భాగంగా ఎక్కడ ఎన్నికలు జరిగిన తమ అభ్యర్థులను పోటీలో ఉంచేందుకు ఎంఐఎం సిద్ధంగా ఉంది.

ఇక ఈ నేపథ్యంలోనే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో పోటీకి సిద్దమవుతుంది.

కమల్ పార్టీతో ఎంఐఎం దోస్తీ!