Kajal Agarwal: కూరలో కరివేపాకులా తీసేస్తున్నారే పాపం!

266

Kajal Agarwal: టాలీవుడ్ చందమామ అంటే ఆ క్రేజే వేరు. కుర్ర హీరోల నుండి సీనియర్ హీరోల వరకు వరస పెట్టి అందరినీ తన చుట్టూ తిప్పించుకున్న కాజల్ ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను పట్టేస్తుంది. ఒకవైపు పెళ్ళై కొత్త పెళ్లి కూతురులా ఆ రోజులను ఎంజాయ్ చేస్తూనే షూటింగ్స్ కంప్లీట్ చేస్తుంది. అయితే.. పేరుకు స్టార్ హీరోల సినిమాలే కానీ బొమ్మలో కాజల్ కు అంత సీన్ మాత్రం లేదనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు ఈ చందమామని కూరలో కరివేపాకులా తీసేస్తున్నారా అనిపిస్తుంది.

కాజల్ ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళంలో మూడు క్రేజీ సినిమాలు చేస్తుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు తమిళంలో కమల్ హాసన్ భారతీయుడు 2, హిందీలో జాన్ అబ్రహాం సాగా సినిమాలలో నటిస్తుంది. ఇవి కాకా మరో మూడు సినిమాలకు కూడా సైన్ చేసింది. ఆచార్యతో మెగాస్టార్ మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రామ్ చరణ్ కూడా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా కోసం భారీ ఖర్చు చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా టీజర్ మొన్ననే విడుదలైంది.

మొన్న రిలీజ్ చేసిన ఆచార్య టీజర్ లో హీరోయిన్ కాజల్ ఎక్కడా కనిపించలేదు. ఇక హిందీలో జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా సంజయ్ గుప్తా తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ముంబై సాగా టీజర్ తాజాగా విడుదలైంది. ఇదీ కూడా క్రేజీ ప్రాజెక్ట్. కానీ ఈ టీజర్ లో కూడా కాజల్ కనిపించలేదు. దీంతో చందమామ అభిమానులకు ఇప్పుడు ఒళ్ళు మండిపోతుంది. మా హీరోయిన్ అంటే మీకు కూరలో కరివేపాకా అని సోషల్ మీడియాలోనే దర్శక, నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు. టీజర్ లో అసలు బొమ్మ పడలే అంటే ఇక సినిమాలో ప్రాధ్యానత ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Kajal Agarwal: కూరలో కరివేపాకులా తీసేస్తున్నారే పాపం!