షూటింగ్ లో కేక్ కట్ చేసిన కాజల్ దంపతులు

146

కొత్త జంట కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ హైదరాబాద్ వచ్చారు. ఆచార్య సినిమా షూటింగ్ లో భాగంగా ఈ జంట ముంబై నుంచి నేరుగా శంషాబాద్ వచ్చి. అక్కడినుంచి షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారు. షూటింగ్ స్పాట్ లో చిత్ర యూనిట్ కొత్త దంపతులకు బొకేలతో ఘనస్వాగతం పలికారు.

అనంతరం కేట్ కట్ చేయించారు.. ఈ కార్యక్రమంలో ఆచార్య సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ డీఐపీ తీరు సహా పలువురు పాల్గొని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆచార్య మూవీలో చిరంజీవి సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరులో గౌతమ్‌ కిచ్లూను పెళ్లాడిన ఆమె ఆ వెంటనే హనీమూన్ కు వెళ్లిపోయారు. ఇక సోమవారం హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇక ఈ సినిమాలో చెర్రీ అతిథి పాత్రలో మెరవనున్నారు. చరణ్ సరసన కియారా అద్వానీ నటించనున్నారు. చిత్రంలో చరణ్ విద్యార్థి నాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

షూటింగ్ లో కేక్ కట్ చేసిన కాజల్ దంపతులు