Cricketer Harshavardhan : ఐపీఎల్ కు కడప కుర్రాడు

164

కడప జిల్లాకు చెందిన హర్షవర్ధన్ రెడ్డికి ఐపీఎల్ లో అవకాశం దక్కింది. జిల్లాలోని చిన్నమండెం మండలం బోనమల గ్రామ సమీపంలోని నాగురివాండ్లపల్లెకు చెందిన హర్షవర్ధన్ రెడ్డిని ఐపీఎల్ వేలంలో చెన్నై జట్టు 20 లక్షలకు కొనుగోలు చేసింది. హర్షవర్ధన్ రెడ్డికి క్రికెట్ అంటే చిన్న నాటి నుంచే ఇష్టం ఇష్టాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడికి అన్ని విధాలా సహకరించారు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు క్రికెట్ ప్రాక్టీస్ కి వెళ్ళవాడు హర్షవర్ధన్.. ఆలా ఆడుతూ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు.

2016 లో అండర్ 19 లో అడుగు పెట్టాడు. 2018 నుంచి ఆంధ్ర జట్టుకు ఆడుతున్నాడు హర్షవర్ధన్.. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ వేలం నిర్వహిస్తుండటంతో రిజిస్టర్ చేసుకున్నాడు. షార్ట్ లిస్ట్ లో పేరు వచ్చింది. చెన్నై జట్టు హర్షవర్ధన్ ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా హర్షవర్ధన్ బౌలింగ్ లో మంచిగా రాణిస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ లో ఎక్కువగా బౌలర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. దింతో హర్షవర్ధన్ కు అవకాశం దక్కింది.

Cricketer Harshavardhan : ఐపీఎల్ కు కడప కుర్రాడు