5 కోట్ల లగ్జరీ కారు కొన్న ఎన్టీఆర్

286

‌తెలుగు సినీ పరిశ్రమల్లో చాలామంటి స్టార్లు ఖరీదైన కార్లను వాడుతుంటారు. కొందరు తమకు ఇష్టమైన కార్లను కొని ఆ విషయాన్నీ అభిమానులతో పంచుకుంటారు. మరికొందరు కారు కొన్న విషయం బయటకు చెప్పేందుకు ఇష్టపడరు.. అందుకే ఇప్పటికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలు ఏ కార్లు వాడుతున్నారు అనేది బయటకు తెలియదు. వారి అభిమాన హీరో ఏ కారు వాడుతున్నారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు అభిమానులు.

కారు వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్ నెట్ లో తెగ సెర్చ్ చేస్తుంటారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ ఖరీదైన లగ్జరీ కారు కొన్నట్లుగా సమాచారం. లాంబోర్గిని ఉరుస్‌ అనే కారుని కొనుగోలు చేశారట. మామూలుగా ఎన్టీఆర్‌కి కార్లంటే చాలా ప్యాషన్‌. ఇప్పుడు ఎంతో ముచ్చటపడి ఈ ఇంపోర్టెడ్‌ కారుని కొనుగోలు చేశారట. ఇటలీ నుంచి ఈ కారును దిగుమతి చేయిస్తున్నారని సమాచారం. ఈ సూపర్‌ స్పోర్ట్స్‌ కారు ఖరీదు 5 కోట్ల వరకు ఉంటుందని టాక్‌.

5 కోట్ల లగ్జరీ కారు కొన్న ఎన్టీఆర్