Jr NTR: మరోసారి బుల్లితెరపై హోస్ట్‌గా ఎన్టీఆర్.. ప్రోమో రిలీజ్!

10434

Jr NTR: బుల్లి రాముడు మరోసారి బుల్లితెర మీద రచ్చ చేసేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే మా టీవీ బిగ్ బాస్ తొలి సీజన్ లో తనదైన టైమింగ్ తో అదరగొట్టిన జూనియర్ ఆ తర్వాత మళ్ళీ బుల్లితెర మీద కనిపించలేదు. అయితే.. జూనియర్ హోస్ట్ చేస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఎన్టీఆర్ ఇప్పుడు మరో కొత్త షోతో ప్రతి ఇంటికి వచ్చేందుకు సిద్దమయ్యాడు. నాగార్జున హోస్ట్‌గా మా టీవీలో రూపొందిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అనే కార్య‌క్ర‌మాన్ని ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులుగా మార్చి జెమినీ టీవీ స‌రికొత్త షో ప్లాన్ చేస్తుంది.

కొంతకాలంగా ఎవరు మీలో కోటీశ్వరుడు షో గురించి ముమ్మర ప్రచారం జరుగుతుండగా దీనిని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌బోతున్నాడని కథనాలు వచ్చాయి. ఆ ప్రచారం నిజమే అనేలా కొద్ది సేప‌టి క్రితం బిగ్గెస్ట్ మోస్ట్ ఎంట‌ర్‌టైనింగ్ షో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అంటూ ఓ ప్రోమో విడుద‌లైంది. అనుకున్నట్లుగానే ఎవరు మీలో కోటీశ్వరులు అని టైటిల్ ఖరారు చేశారు కానీ హోస్ట్ సీట్‌లో ఎన్టీఆర్‌ని మాత్రం పూర్తిగా రివీల్ చేయ‌కుండా, షాడో రూపంలో చూపించారు.

ఇప్పటికే ఎన్టీఆర్‌కు సంబంధించి ప‌లు ప్రోమోస్ షూట్ చేయగా త్రివిక్ర‌మ్ వీటిని డైరెక్ట్ చేశాడు. రానున్న రోజుల‌లో ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేయ‌నున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌ బాగా ప్రజాదరణ పొందడంతో దాన్ని కాస్త మార్చి ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ తీసుకొస్తున్నారు. కరోనా కారణంగా గతేడాదే మొదలవ్వాల్సిన ఈ షో ఇప్పుడు ఇలా రిలీజ్ అవుతుంది. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న తారక్ ఈ షో ద్వారా ప్రేక్షకులను అటెన్స్ క్రియేట్ చేసేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక షో కోసం ఒక్కో ఎపిసోడ్ కు కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా వినిపిస్తుంది.