రికార్డ్ స్థాయిలో జర్నలిస్టుల అరెస్ట్

91

2020లో రికార్డ్ స్థాయిలో జర్నలిస్టుల అరెస్ట్ జరిగినట్లుగా కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ సంస్థ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అరెస్ట్ అయిన జర్నలిస్టుల వివరాలను ఈ సంస్థ సేకరిస్తుంది. ఈ ఏడాది 274 మంది జర్నలిస్టులు అరెస్ట్ అయినట్లుగా తెలిపింది. కరోనా మహమ్మారి కవరేజ్ కి వెళ్లిన వారిని, సంక్షోభాన్ని రిపోర్ట్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

జర్నలిస్టుల అరెస్టు గురించి న్యూయార్క్‌కు చెందిన ఈ గ్రూపు 1990 నుంచి డేటాను సేకరిస్తున్నది. గత ఏడాది 250 మంది వరకు జర్నలిస్టులను అరెస్టు చేశారని, ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగినట్లు సీపీజే చెప్పింది. ఇంత పెద్ద మొత్తంలో అరెస్టులు జరగడానికి నిరసనలు, రాజకీయ ఉద్రిక్తతలే ప్రధాన కారణమని తెలుస్తోంది.

చైనా, టర్కీ, ఈజిప్ట్‌, సౌదీ అరేబియాలో ఈ అరెస్టులు ఎక్కువగా ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇక నకిలీ వార్తలు రాసిన జర్నలిస్టులు 34 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్టులను అరెస్టు చేయడం దారుణమని సీపీజే ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జోయల్ సైమన్ ఓ ప్రకటనలో తెలిపారు.

 

రికార్డ్ స్థాయిలో జర్నలిస్టుల అరెస్ట్