కరోనా వార్తలు కవర్ చేసిన జర్నలిస్టుకు నాలుగేళ్లు జైలు శిక్ష

70

కమ్యూనిస్ట్ కంట్రీ డ్రాగన్ విస్తుపోయే నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ బయటపడిన వుహాన్ నగరంలో వార్తలు కవర్ చేసిన ఓ మహిళ జర్నలిస్టుకు చైనా న్యాయస్థానం నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది. తప్పుడు కథనాలు రాయడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం అనే అభియోగాలను మోపుతూ ఆమెపై కేసులు నమోదు చేశారు. కాగా చైనాలో ఇటువంటివి సర్వాధారణ విషయాలు. గతంలో ఎంతోమంది జర్నలిస్టులను జైలుకు పంపిన చరిత్ర చైనాకు ఉంది. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించే ఉద్యమకారులపై తరచూ ఇలాంటి అభియోగాలు మోపుతుంటారు.

37 ఏళ్ల మాజీ న్యాయవాది, జర్నలిస్ట్‌ లీ ఝాంగ్‌ ఝాన్‌ మే నెల నుంచి ప్రభుత్వ అదుపులో ఉన్నారు. అక్రమంగా తనను బందిచడంపై కొన్ని నెలలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని ఆమె తరపు లాయర్ తెలిపారు. కరోనా సమయంలో వుహాన్ సిటీలో రిపోర్టింగ్ చేసి ఇబ్బందులకు గురైన సిటిజన్ జర్నలిస్టులు చాలామంది వున్నారు. వారిలో ఝాంగ్‌ ఝాన్‌ ఒకరు

కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించగానే ఝాంగ్‌ ఝాన్కుప్పకూలిపోయిందని ఆమె తరఫు లాయర్లలో ఒకరు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు చెప్పారు. తీర్పు వచ్చినప్పుడు కోర్టులోనే ఉన్న లీ ఝాన్‌ తల్లి బిగ్గరగా ఏడ్చినట్లు కూడా వెల్లడించారు.కాగా చైనా గతంలో కూడా ఇటువంటి చర్యలకు పాల్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాస్తే వారిని జైలుకు పంపుతుంది కమ్యూనిస్టు దేశం.

కరోనా వార్తలు కవర్ చేసిన జర్నలిస్టుకు నాలుగేళ్లు జైలు శిక్ష