అమెరికా వైట్ హౌస్ లో కరీంనగర్ బిడ్డ

414

దేశ ప్రతిష్టను ఎల్లలు దాటిస్తున్నారు తెలుగు వ్యక్తులు. ప్రపంచంలోని ప్రముఖ కంపనీలో ఎందరో తెలుగువారు పెద్ద పెద్ద స్థానాల్లో పనిచేస్తున్నారు. ఇక తాజాగా మరో తెలుగు వ్యక్తికి అమెరికా అధ్యక్షుడిగా కొలువుదీరనున్న జో బైడెన్‌ టీమ్‌లో చోటుదక్కింది. బైడెన్‌కు స్పీచ్‌ రైటింగ్‌ డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి చొల్లేటి వినయ్‌రెడ్డి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి నారాయణరెడ్డి, విజయారెడ్డి దంపతుల కుమారుడే ఈ వినయ్ రెడ్డి. ఈ దంపతులు 1970 లో అమెరికా వెళ్లారు. నారాయణరెడ్డి డాక్టర్ గా అమెరికాలోనే స్థిరపడ్డారు.

వీరికి ముగ్గురు కుమారులు వీరిలో ఒకరే వినయ్ రెడ్డి. అమెరికాలోని ఒహియా రాష్ట్రం డేటన్‌లో పుట్టి పెరిగిన వినయ్‌రెడ్డి కేజీ నుంచి డిగ్రీ వరకు ఒహియాలోనే చదువుకున్నారు. మియామి విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ కు ప్రధాన సలహాదారుగా వ్యవహరించారు వినయ్ రెడ్డి. తమ గ్రామానికి చెందిన వినయ్ రెడ్డి పెద్ద స్థాయికి ఎదగడంతో ఆ గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు. కాగా వినయ్ రెడ్డి తాత చొల్లేటి తిరుపతిరెడ్డి పోతిరెడ్డిపాడు గ్రామానికి 30 ఏళ్లు సర్పంచిగా పనిచేశారు. ఇక ఇప్పటికి వీరికి గ్రామంలో సొంత ఇళ్లుతోపారు ఐదెకరాల పొలం ఉంది. నారాయణరెడ్డి కుటుంబం అప్పుడప్పుడు సొంత ఉరుకు వచ్చి వెళ్తుంటారని అక్కడి వారు చెబుతున్నారు.