జియో బంపర్ ఆఫర్.. రెండేళ్లపాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్

69

రిలియన్స్ జియో మార్కెట్లోకి వస్తూనే టెలికం రంగాన్ని కుదిపేసింది. అప్పటివరకు వందల్లో ఉండే ఇంటర్నెట్, కాల్ రీఛార్జ్ రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. తక్కువ రేటుకే ఇంటర్ నెట్ సేవలు అందించి అతి తక్కువ కాలంలోనే దిగ్గజ టెలికాం కంపెనీగా ఎదిగింది. అతి తక్కువ సమయంలో వన్ మిలియన్ కష్టమర్లను సాధించిన రికార్డ్ రిలియన్స్ జియో మీదే ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు జియో మరో ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రెండేళ్లపాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రూ.1,999 ధరతో మార్కెట్లోకి కొత్త మొబైల్ తీసుకొస్తున్నామని, ఆ మొబైల్‌ను కొనుగోలు చేసిన వారికి ఏకంగా 24 నెలల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, నెలకు 2 జీబీ డేటా అందించనున్నట్లు ప్రకటిచించింది.

దీనితో పాటు రూ.1,499కి లభించే మరో మొబైల్ కొంటే 12 నెలల పాటు ఇవే సర్వీసులు ఉచితంగా అందించనున్నామని తెలిపింది. అయితే ఇప్పటికే జియో ఫీచర్ ఫోన్ వాడుతున్న వారు రూ.749తో రీచార్జ్ చేసినా ఈ ఆఫర్ వర్తిస్తుందని, కస్టమర్లు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని జియో కోరింది. జియో తీసుకొచ్చిన ఈ ఆఫర్ వినియోగదారులకు అందుబాటులో ఉండటంతో మార్కెట్లోకి మొబైల్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.

జియో బంపర్ ఆఫర్.. రెండేళ్లపాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్