జిగేల్ రాణి చిరు కోసం కాదు.. చెర్రీ కోసమే!

200

మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. అటు వయసును ఇటు అభిమానుల కోరికకు తగ్గట్లే కథలు ఎంచుకొని ముందుకెళ్తున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం అపజమెరుగని దర్శకుడిగా పేరున్న కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముమ్మరంగా జరుగుతుండగా బుధవారం సినిమా అప్డేట్ కూడా దర్శకుడు విడుదల చేశాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టగా ఇప్పుడు పూజ హెగ్డే కూడా నటించనుందని దర్శకుడు కన్ఫర్మ్ చేశాడు.

అయితే.. జిగేల్ రాణి పూజని ఒకే చేసింది మాత్రం చిరు కోసం కాదట.. కుమారుడు రామ్ చరణ్ కోసమట. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ పాత్రలో మెరవనున్నాడు. ఇప్పటికే పలుమార్పు తండ్రి సినిమాలలో కనిపించినా ఈసినిమాలో మాత్రం రాంచరణ్ పాత్ర నిడివితో ఉంటుందట. అందుకే చరణ్ కు జోడిగా హీరోయిన్ కూడా ఉండనుందట. ఇంతకాలం ఆ హీరోయిన్ని వెతికే పనిలో పడిన చిత్రబృందం. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను ఓకే చేసింది. చరణ్ జోడిగా సమంత, కియారా, రష్మికల పేర్లు వినిపించినా చివరికి పూజా కన్ఫర్మ్ అయింది.

పూజా ప్రస్తుతం ప్రభాస్, అఖిల్, సల్మాన్, రన్వీర్ సింగ్ సినిమాలతో ఖాళీ లేకుండా ఫుల్ బిజీగా ఉండగా చిన్న పాత్ర కోసం ఈ సినిమాకు ఒప్పుకోవడం ఫిల్మ్ వర్గాలలో చర్చగా మారింది. అయితే.. పాత్ర పేమెంట్ మాత్రం ఫుల్ గా డిమాండ్ చేసిందట. అయితే మాములుగా సినిమా మొత్తానికి తీసుకునే పారితోషికం పూజా డిమాండ్ చేయడంతో చేసేదేం లేక మేకర్స్ కూడా అంగీకరించినట్లు సమాచారం. చూడాలి మరి రాంచరణ్ సరసన పూజా జిగేల్ రాణిగా చిందులేసింది. మరి ఈసారి ఈ జంట ఎలా అలరిస్తుందో!

జిగేల్ రాణి చిరు కోసం కాదు.. చెర్రీ కోసమే!