భర్తపై కేసు.. రంగంలోకి జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి

1312

అనంతపురంలో రాజకీయాలు వేడెక్కాయి. తాడిపత్రి కేంద్రంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇరు పార్టీల నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తె భగ్గుమనేలా ఉంది. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనపై అక్రమ కేసు బనాయించారని ఆరోపిస్తూ జేసీ బ్రదర్స్ ఈ రోజు తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. దింతో పోలీసులు అప్రమత్తమైన ఇరువురిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమా రెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మరో వాహనంలో ఆమెను ఇంటికి పంపారు.

అంతకు ముందు ఆమె అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారె అవకాశం ఉందని భావించిన పోలీసులు ఆమెను వేరే వాహనంలో ఇంటికి పంపారు. కాగా ఆమె ఎస్సీ, ఎస్టీ కేసు దుర్వినియోగం అవుతుందని ఆరోపిస్తూ ఓ ప్లకార్డు పట్టుకొని నిరసన తెలిపారు. ప్రస్తుతం జేసీ వ్యవసాయ క్షేత్రంతోపాటు, ఆయన ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనకు బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు

భర్తపై కేసు.. రంగంలోకి జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి