బీజేపీలోకి జేసీ దివాకర్ రెడ్డి

83

అనంతపురం మాజీ ఎంపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టీడీపీలో ఉంటే భవిష్యత్ కష్టమని భావించిన జేసీ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. కాగా గతంలో కూడా జేసీ బీజేపీలోకి వస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో వాటిని ఆయన ఖండించారు. తాజాగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, కార్యకర్తల నుంచి ఒత్తిళ్లు రావడంతో పార్టీ మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

ఇక త్రిశూల్ సిమెంట్స్ ఫ్యాక్టరీ కేసులో జేసీ దివాకర్ రెడ్డికి అధికారులు 100 కోట్ల రూపాయాల జరినామా విధించిన విషయం తెలిసిందే.. జరిమానా కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని తెలిపింది. ఇక వాహన రిజిస్ట్రేషన్స్ కు సంబందించిన కేసులు కూడా జేసీ ఫ్యామిలీపై ఉన్నాయి. తాజాగా జేసీ తమ్ముడు, అతడి కుమారుడు జైలుకు కూడా వెళ్లి వచ్చారు.

 

బీజేపీలోకి జేసీ దివాకర్ రెడ్డి