నేడు “అమ్మ” జయంతి

211

తమిళనాట “అమ్మ” అని పిలిపించుకున్న జయలలిత జయంతి నేడు. ఫిబ్రవరి 24, 1948లో నాటి మైసూరు నేటి కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు. చిన్నతనం నుంచే జయలలిత చదువుల్లో చురుక్కుగా ఉండేవారు. చదువుల్లో రాణిస్తున్న సమయంలోనే ఆమెకు సినిమా అవకాశాలు తలుపుతట్టాయి. 1961లో సినీరంగ ప్రవేశం చేశారు. తమిళ తెలుగు భాషలో 140 చిత్రాల్లో నటించారు జయలలిత.. తెలుగులో శోభన్ బాబుతో చాలా సినిమాల్లో నటించారు. తమిళంలో ఎంజీఆర్ తో అత్యధిక సినిమాలు చేశారు జయలలిత.

1980లో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జయలలిత ఎంజీఆర్ స్థాపించిన ఏఐఏడిఎంకే పార్టీలో చేరారు. రాజకీయంగా ఎదిగారు. 1984లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్టీలో చేరిన కొన్ని ఏళ్లలోనే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు.. 1991 లో జయలలిత తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 2001 కొంతకాలం సీఎంగా చేశారు. 2002 నుంచి 2006 వరకు, ఆ తరువాత 2010 నుంచి 2015, 2015 నుంచి 2016 డిసెంబర్ 5 తేదీన మరణించే వరకు ఆమె ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. తమిళనాడులో ప్రజలు జయలలితను అమ్మ, పురట్చి తలైవి అని పిలుస్తారు. రాజకీయాల్లో జయలలిత చక్రం తిప్పారు. దక్షిణాదిన ప్రధాన మంత్రి అయ్యే అవకాశం ఉన్న నాయకుల్లో జయలలిత పేరు మొదటి వరుసలో ఉండేది. దక్షిణాది నుంచి కేంద్రంలో ఉన్న పార్టీలకు ఒణుకు పుట్టించిన వనిత ఈ పురట్చి తలైవి.. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న సమయంలోనే అనారోగ్యంతో జయలలిత మృతి చెందారు.

80 రోజులకుపైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలు అస్తవ్యస్తమయ్యాయి. సీఎం సీటుకోసం ఫలని, పన్నీరు మధ్య కొంతకాలం అంతర్యుద్ధం జరిగింది. చివకు పన్నీరుకే పట్టం కట్టారు పార్టీ పెద్దలు. కాగా నేడు జయలలిత జయంతి.. ఆమెకు ఇవే మా నివాళి

నేడు “అమ్మ” జయంతి