చలి తీవ్రతకు బోర్డర్ లో ఏపీ జవాన్ మృతి

99

జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దులో విధులు నిర్వహిస్తూ చలి తీవ్రతకు ఓ జవాన్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గడ్డకిందిపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప నాయుడు అనే 38 ఏళ్ల జవాన్ చలి తీవ్రతకు అస్వస్థకు గురయ్యాడు. దింతో అతడికి ప్రధమ చికిత్స అందించారు తోటి జవాన్లు, అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

వెంటనే వారు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. హెలికాఫ్టర్ లో తరలిస్తుండగానే పరిష్టితి విషమించి జవాన్ మృతి చెందారు. కాగా 14 ఏళ్లుగా రెడ్డప్ప నాయుడు ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెడ్డప్ప నాయుడు మృతితో స్వగ్రామం గడ్డకిందిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా మంగళవారం రెడ్డప్ప నాయుడి మృతదేహం స్వగ్రామానికి రానుంది