ఏప్రిల్ నుంచి యాడ్స్‌ ఫ్రీగా ఎస్వీబీసీ

144

ఏప్రిల్ నుంచి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) యాడ్స్‌ ఫ్రీగా ప్రసారం అవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. ఎస్వీబీసీలో మార్చి వరకు యాడ్స్ అగ్రిమెంట్ ఉన్న కారణంగా అప్పటివరకూ యాడ్స్ వస్తాయని.. ఆ తరువాత యాడ్స్ నుంచి విముక్తి లభిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం శ్రీవారి సేవలన్నీ ఏకాంతంగా జరుగుతున్నాయని, త్వరలోనే భక్తులను అనుమతిస్తామని అన్నారు..

తిరుచానూరులో పద్మావతి అమ్మవారి సేవలు కూడా ప్రస్తుతం ఏకాంతంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రథసప్తమి ముందురోజే సర్వ దర్శనం టోకెన్లు ఇస్తామని తెలిపిన జవహర్‌రెడ్డి వృద్దులు, చిన్న పిల్లల దర్శనాలను కరోనా కారణంగా మరో నెలవరకూ రద్దు చేసినట్టు చెప్పారు.