కరోనా వ్యాక్సిన్.. 10,500 డీప్ ఫ్రీజర్‌ల కొనుగోలు

73
Japan to buy 10,500 freezers for coronavirus vaccines
deep freezers

కరోనావైరస్ వ్యాక్సిన్లను నిల్వ చేయడానికి 10,500 డీప్ ఫ్రీజర్‌లను కొనుగోలు చేయాలనీ జపాన్
ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్ నుండి తన జనాభాను రక్షించడానికి జపాన్ సిద్ధమవుతున్నందున డీప్ ఫ్రీజర్‌లను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.

ఫైజర్ ఇంక్, ఆస్ట్రాజెనెకా పిఎల్‌సి , మోడెర్నా ఇంక్ నుండి మొత్తం 290 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌లను జపాన్ ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకుంది. మొత్తం 145 మిలియన్ల మందికి రెండు డోసుల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది..

అయితే ఫైజర్ టీకాను మైనస్ 75 సెల్సియస్ లో.. మోడరనా టీకాను మైనస్ 20 సెల్సియస్ లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల డీప్ ఫ్రీజర్‌ల కొనుగోలుపై యోచిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా జపాన్‌లో మొత్తం 165,000 కరోనావైరస్ సంక్రమణ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 2,417 మరణాలు సంభవించాయి, రాజధాని టోక్యో మాత్రం తీవ్రంగా దెబ్బతింది. టోక్యోలో గత 24 గంటల్లో 352 కొత్త కేసులు నమోదయ్యాయి.