ఉగ్రవాదుల దాడిలో వీధి కుక్క మృతి

74

జమ్మూకాశ్మీర్ లో జవాన్లను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు దిగుతున్నారు. సరిహద్దుల్లో నక్కి గ్రెనేడ్లను విసురుతున్నారు. దింతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిష్టితితులు నెలకొన్నాయి. మరో వైపు సైన్యం పాకిస్థాన్ బలగాలను కూడా టార్గెట్ చేస్తుంది.

సరిహద్దు వద్ద కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్ సైన్యానికి భారత్ దీటైన జవాబు ఇస్తుంది. ఇక ఈ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు పాక్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తుంది. మరోవైపు ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడిలో ఓ వీధికుక్క ప్రాణాలు కోల్పోయింది. ఉదయం 6.30 గంటల ప్రాతంలో ఉగ్రవాదులు సీఆర్పీపీఎఫ్ కు చెందిన 161 బెటాలియన్ బంకర్పై గ్రెనేడ్ దాడికి పాల్పడగా..

అది రోడ్డుపై పడి పేలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఓ వీధి శునకం తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడికి పాల్పడిన ముష్కరుల కోసం గాలింపు జవాన్లు చర్యలు చేపట్టారు.

ఉగ్రవాదుల దాడిలో వీధి కుక్క మృతి