జమ్మూ కాశ్మీర్ కంటే దారుణంగా పశ్చిమ బెంగాల్ :- బీజేపీ

93

పశ్చిమ బెంగాల్ లో శాంతి భద్రతలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయాని బీజేపీ ఎన్నికల సంఘానికి లేక రాసింది. జమ్మూ కాశ్మీర్ కంటే దారుణమైన పరిస్థితిలు పశ్చిమ బెంగాల్ లో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. బెంగాల్ లో వీలైనంత త్వరగా కేంద్ర బలగాలను మోహరించాలని కోరింది. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని బీజేపీ ఎన్నికల సంఘానికి తెలిపింది. కేంద్ర బలగాలు వెళ్లకపోతే శాంతి భద్రతలు దిగజారుతాయని పేర్కొంది.

రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని అత్యవసరంగా విధించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రాష్ట్ర పోలీస్ శాఖ తమ ప్రచారానికి సహకరించడం లేదని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర బలగాలు లేనిదే ఇతర పార్టీలు ప్రచారం చెయ్యడం కష్టమని వివరించారు.

కాగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఢీ అంటే ఢీ అనేలా ఉంది. రాష్ట్రంలో ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా నడ్డా వాహనాన్ని అడ్డుకొని అతడి కాన్వాయ్ పై కూడా దాడి చేశారు.

జమ్మూ కాశ్మీర్ కంటే దారుణంగా పశ్చిమ బెంగాల్