జమిలీ ఎన్నికల నిర్వహణకు మేము సిద్దమే

64

జమిలీ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జమిలీ ఎన్నికలపై మాట్లాడిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సునీల్ అరోరా ఒకే దేశం ఒకే ఎలక్షన్ అన్న నూతన పద్ధతిని అమలు చేయడానికి సిద్ధమని అన్నారు. జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ సవరణలు చెయ్యాల్సి ఉందని తెలిపారు.

నవంబర్ 26 రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శాసన వ్యవహారాల ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన జమిలీ ఎన్నికలపై మాట్లాడారు. ఎన్నికలు కొన్ని నెలల వ్యవధిలో వస్తుండటం వలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతంలో కోడ్ అమలులో ఉంటుంది కాబట్టి అక్కడ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని తెలిపారు.

జమిలీ ఎన్నికల వలన అభివృద్ధికి ఆటంకం ఏర్పడకుండా చూడవచ్చని తెలియచేశారు. ఇక ప్రధాని మాటలపై స్పందించిన అరోరా జమిలీకి తాము సిద్దమే అని తెలిపారు

జమిలీ ఎన్నికల నిర్వహణకు మేము సిద్దమే