కేసీఆర్ కు మందులో సోడా కలిపి మంత్రయ్యావు :- జగ్గారెడ్డి

113

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ కు విస్కీలో సోడా కలిపి జగదీష్ రెడ్డి మంత్రి అయ్యారని జగ్గారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఓ సాధారణ అడ్వకేట్ అయిన జగదీష్ ఉత్తమ్ గురించి మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాడర్ లేని మంత్రి నెహ్రూపై కామెంట్స్ చెయ్యడం విడ్డురంగా ఉందని జగ్గారెడ్డి అన్నారు. ఆయన కరెంట్ మినిష్టర్ అయినా ఆయనదగ్గర పవర్ లేదని అన్నారు.

కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయి కాబట్టే తాము విచారణకు డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. తనపై ఉన్న పాస్​పోర్ట్​కేసుకు సీఎం కేసీఆర్‌‌‌‌, మంత్రి హరీశ్‌‌‌‌లే గురువులన్నారు. వారు గతంలో చేసిన పని అదే అని గుర్తు చేశారు. రూ.5 వేల కోట్లు పోగేసి టీఆర్ఎస్​సర్కారును పడగొట్టేందుకు హరీష్ రావు పడగొట్టారని సంచల వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. టీఆర్ఎస్ నేతలు అక్రమంగా ఆస్తులు సంపాదించారని, పల్లారాజేశ్వర్ రెడ్డి వందలకోట్లు సంపాదించలేదు అంటూ ధ్వజమెత్తారు. సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ కేసు ఉండటంతోనే ఆమెను కాబినెట్ లోకి తీసుకున్నారని అన్నారు జగ్గారెడ్డి