Happy Birthday Jagan: పుట్టిన రోజు.. పెండింగ్ పనులు..

294

క్రిస్మస్ రాక మునుపే..
ఆనందాలు వెల్లువ కొన్నింట
తారల వెలుగుల కూడికల్లో
ఏమయినా వ్యత్యాసాలు చూడాలి
ఉన్నాయో లేవో
వెలుగు ను అపరిష్కర్తగా మార్చాను
అన్నింటా అదే పెనుత్పాతం కావొచ్చుఒ
ఒక్కడిని ఒంటరని హేళన చేస్తున్న
సందర్భాన మద్దతు ఇచ్చాను

ఆ రోజు నియంతను తరిమేసిన తుఫాను గొంతుక అని చెప్పేను
గెలిచాక రాజశేఖర్ రెడ్డి అబ్బాయి ప్రజల మన్నన అందుకున్నాక
రాజశేఖర్ రెడ్డి అబ్బాయి ఎలా ఉన్నారు

ఓవర్ టు కార్మెల్ పాయింట్

అక్కడి నుంచే మాకు తెలిసిన అడుగులు
ఆ బంజారాహిల్స్ దారుల్లోనే మా అడుగులు
వాటికి కొనసాగింపుగా కొన్ని స్నేహాలు ఇన్నేళ్లూ
పనిచేయడం సమర్థత అవుతుందా
ఉహూ పనిచేయించడం సమర్థతలో భాగం అవుతుంది
ఎవరిని నమ్మాలి ఎవరిని ప్రేమించాలి అన్న నిర్ణయంలో
ప్రజలను నమ్మాలి అభివృద్ధిని ప్రేమించాలి నోట్లను పంచడం కాదు
ఇదొక్కటే విభేదం కేంద్రంతో కయ్యం ఉంటేనే మేలు సత్తా తెలుస్తుంది
ఇదొక్కటే విభేదం.. ఇంకా కొన్ని నినిని
ని అనగా నిషేధం ని అనగా నిషాదం కూడా ,,

తారీఖుల తరీఖా ఎలా ఉన్నా క్యాలెండర్ లెవండర్ ఫ్లేవర్లను మర్చి పోతున్నా ఆ పరిమళ సంబంధ జ్ఞాపకం ఒకటి మన జీవితాల ను ప్రభావితం చేయక తప్పదు. గతానుగతిక ఛాయలలో మనం బతకక తప్పదు. పుట్టిన రోజును ఎలా చూడాలి..సంబంధిత క్షణా లను ఎలా కూడాలి అన్నది అతి పెద్ద సంశయం. సందిగ్ధతలను దాటుకుని పోతూ ఉంటే కొన్ని ప్రశ్నలకు పరిశీలనాత్మక విశ్లేషణ ఒ కటి వెతకాలి. మార్పు దిశగా రాజ్యంలో వచ్చే సంస్కరణల అమలుకు రాజు ఏ విధంగా కృషి చేస్తున్నారో అన్నది ఒక సత్య నిష్టకు సంబంధించిన ప్రాతిపదిక. ప్రాతిపదికలూ ప్రతి చర్యలూ అన్నీ ఒక మంచి పాలనకు గీటు రాయి కావాలి. మంచి అనగా డబ్బులు పంచడం కాదన్నది నా విహితం అయిన మాట.. మంచి అంటే ప్రాజెక్టుల నిర్వహణ అని నా విహితం అయిన మాట. మాటను పట్టించుకుని, జీవితాన్ని కొత్త దారుల వెంట పరుగులు తీయించడం ఇప్పటి యువ ముఖ్యమంత్రి బాధ్యత. ఆయన పేరు జగన్మోహ న్ రెడ్డి. ఈ రోజు పుట్టిన రోజు. శుభాకాంక్షలు చెప్పడం బాధ్యత. బాధ్యతకు అదనపు హంగులేవీ ఉండవు. బాధ్యత నిర్వహణలో కొ ద్దిపాటి స్వార్థం కూడా ఉండి ఉండాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి..నిశ్చయం అయి ఉండాలి. అభివృద్ధికి కొత్త బాట ఒకటి వెతికి రావాలి. ఇవి ఈ ముఖ్యమంత్రి చేయాలని కోరుతూ రాస్తున్నానొక మార్నింగ్ రాగా..

నియంత..ఎవరితో వారు..రాజ్యంలో ఒకింత అసహనం నెలకొన్న చోటు.. కొత్త ప్రభుత్వం ఆహ్వానం అందుకుంది. ఇప్పటికీ ఇదే అంటాను మరీ 23 సీట్లు వచ్చేలా టీడీపీ ఆ రోజు పాలించిందా అని? ఈ ప్రశ్న దగ్గరే ఆగిపోతాను ఎంపీ రామూకు కూడా ఇదే ప్రశ్న అడిగాను. ఓటమి ఒక వైపు గెలుపు మరో వైపు.. గెలుపును సార్థకం చేసే చర్య మరో వైపు.. కానీ మన రాజ్యాన గెలుపును సార్థ కం చేసే చర్యలు ముమ్మరం కావాలి. కేంద్రంతో ఒక కొట్లాట కోరుకోండి ఏం కాదు. టీఆర్ ఎస్ మాదిరిగా కనీసం మాట్లాడడం అల వర్చుకోండి. ముందు మీడియాను ఫేస్ చేయడం అని నేను చెప్పను. ఆ ముసుగు దొంగల లొసుగులు ముందుకు వెలుగు లో తీసుకురండి. మీరు చేస్తున్నదంతా తప్పే అని అంటానా? అలా అనడంలో ఏమయినా ఔన్నత్యం కానీ ఔచిత్యం కానీ ఉంటుం దా? కానీ కొన్ని నిర్ణయాల అమలు సంబంధిత తొందరపాటు నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఇంకాస్త పరిణితి పాలనలో రావాలి. అపరిప క్వ నిర్ణయాలు కారణంగా రద్దయిపోయిన అన్న క్యాంటీన్లను చూస్తే నిజంగా బాధ కలుగుతుంది. అలానే కొన్ని నిర్ణయాలు నినా దాలు వినిపించినంత స్థాయిలో లేవు. ఇది జగనన్న రాజ్యం ఇది రామ రాజ్యం స్ఫురణకు తెస్తుంది అని చెప్పినంత పరిపక్వత ప్రాభావ శీలక ధోరణి పాలనలో లేదు.

పుట్టిన రోజు సమ్ థింగ్.. పుట్టిన రోజు నథింగ్..

పుట్టిన రోజు ఎలా ఉండాలి.. పుట్టిన రోజున ఎలా ఉండాలి.. ఒకే ఒక్క అక్షరంలో పలికించాను కొన్ని భేదాలు అర్థ భేదం చెల్లించాను. పుట్టిన రోజు ఊళ్లో సంబరంలా ఉండాలి.. పుట్టిన ఊరికో సంతోషం మిగిల్చి పోవాలి.. పుట్టిన రోజు కొత్త వసంతం ఆగమించే సమయాన్ని స్వాగతించాలి. వెళ్లిపోయిన కాలాలు చేసిన గాయాలు కూడా గుర్తుకు వస్తే మేలు. నాన్న అంతటి ఛరిష్మా మీరు
అందుకోవాలి. రాజశేఖర్ రెడ్డి సర్ అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు.. ఇదీ నేను విన్న మాట..లేదా నిరూపణకు కొన్నింట నోచుకున్న మాట..డైనమిజం మాటలోనూ డైనమిజం పాలనలోనూ ఇంకా అలవాటు అయితే మీరు అనుకున్న ఆకాంక్షల నెరవేర్పు అన్నది సాధ్యం.. అవి ప్రజల ఆకాంక్షలు. ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ మీ ఆకాంక్ష.. లక్షకు పైగా ఉద్యోగాల కల్పన
ఆకాంక్ష నెరవేర్పు బాగుంది.. ఆచరణలో ఇంకొన్ని తడబాట్లు ఉన్నా బాగుంది.

కేసీఆర్ సర్ కూడా చేయలేని పని చేశారు ఆర్టీసీ విషయమై బాగుంది.. కానీ పింఛను విషయమై ఉన్న ప్రతిష్టంభన ఒకటి తొలగించండి. ఉద్యోగులకు మీరు వరాలే ఇస్తారో అదిరించి బెదిరించి పనులు చేయిస్తారో మీ ఇష్టం కానీ పాలనలో సమర్థతను నిర్థారించేది అందుకు ప్రామాణికంగా నిలిచేది గౌరవ యంత్రాంగమే. కోటికి పైగా కరోనా పరీక్షలు చేయించారు బాగుంది.. కానీ ఆరోజు సేవలందించిన దిగువ స్థాయి సిబ్బంది ఆఘమే ఘాల మీద నియమితులయిన వైద్య సిబ్బంది ఇవాళ దిక్కులు చూస్తున్నారు. నర్సింగ్ స్టాఫ్ కు ఏదో ఒక రూపాన ఆర్థిక ప్రయో జనం ఇవ్వండి. ఆ వైద్యులకూ ఏదో ఒక రూపాన గౌరవం ఇవ్వండి. ఇది ముందు మీరు చేయాల్సిన పని. కరోనా కారణంగా ప్రాణా లు కోల్పోయిన కుటుంబాల్లో ఇప్పటికీ ఒక అనిశ్చితి ఉంది. దానిని సైతం తొలగించడం మీ బాధ్యత.తీవ్ర తుఫానుల వేళ పంట పోయిన రైతులను ఆదుకోండి. ఈ ఏడాది మా జిల్లాలో మా శ్రీకాకుళంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను కరోనాను సాకుగా
చూపి గాలికొదిలేశారు. ఫలితం శివారు భూములకు నీరందలేదు. అననుకూల వాతావరణ ఫలితంగా పది కరువు మండలాలు
ఉన్నాయి వాటిని ఆదుకోండి. ముఖ్యంగా సంక్షేమ ప్రాధాన్యం తగ్గించి అభివృద్ధి దిశగా అడుగులు వేయండి. మీరు మా శ్రీకాకుళంలో చెప్పారు సరిగ్గా రెండేళ్ల కిందట పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తామని ముందు ఆ దిశగా అడుగులు వేయండి.
మీరు ఇక్కడ ప్రకటించిన సీపీఎస్ రద్దు విషయమై ఆలోచించండి. సీపీఎస్ రద్దు చేసిన రాష్ట్రాల విధాన నిర్ణయాలు ఏ విధంగా
ఉన్నాయో అధ్యయనం చేయండి. తదనుగుణ నిర్ణయం తీసుకోండి. అలానే పాలనపై పట్టు పెంచుకోండి. ఇప్పటికింతే ఇంకొన్ని
తరువాత చెబుతాను..డియర్ సర్ హ్యాపీ బర్త్ డే ….
ఆ రోజు మీరు శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా పాదయాత్రలో భాగంగా చెప్పిన మాటలు కొన్ని దిగువ ప్రస్తావించాను ప్లీజ్ హ్యావ్ ఎ లుక్
– వైఎస్సార్ భరోసాతో ప్రతి రైతుకూ రూ.50 వేలు
– డ్వాక్రా సంఘాలకు రూ.15వేల కోట్లతో వైఎస్సార్ ఆసరా
– పింఛన్లను వెయ్యి నుంచి రెండు వేలకు పెంపు
– నిరుపేద కుటుంబాలకు చదువు నిమిత్తం ఆర్థిక సాయం
– ప్రతి పేదవాడికీ ఇల్లు..అయిదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు
– సమర్థంగా ఆరోగ్యశ్రీ అమలు
– పూర్తి ఫీజు రీ యింబర్స్ మెంట్ అమలు , ప్రతి విద్యార్థికీ భోజనం వసతి నిమిత్తం ఏటా రూ.ఇరవై వేలు
– యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి
– మూడు దశల్లో మద్యపాన నిషేధం
– వీటితో పాటు తాము అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు.
వీటితో పాటు మొన్నటి సిక్కోలు సభలో.. మరికొన్ని వరాలూ ఇచ్చారు
– రెండు లక్షల ఉద్యోగాలనూ ఏపీపీఎస్సీ ద్వారా ఇస్తాం.ప్రతి ఏటా క్యాలెండర్ రిలీజ్ చేస్తాం.దాని ప్రకారమే ఉద్యోగాలు భర్తీ.
– వ్యవస్థలను పూర్తిగా మారుస్తాం. గ్రామసెక్రటేరియట్ లనూ తీసుకువస్తాం.అందులో పది మంది అర్హులకు ఉద్యోగాలు ఇస్తాం.
– గ్రామసెక్రటేరియట్లో ఉద్యోగాలు ఇస్తాం.. దరఖాస్తు చేసిన 72 గంటలకే ప్రభుత్వ పథకాలు మంజూరు చేసేలా చేస్తాం.
– ఇలా చేస్తే లక్షా యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయవచ్చు.గ్రామ సెక్రటేరియట్ సమర్థంగా పనిచేసేందుకు యాభై ఇళ్లకు ఒక గ్రామ వలంటీరును నియమించి ఐదు వేల రూపాయలను ఇస్తాం. ఆయనే లైజెనింగ్ ఏజెంట్ గా పనిచేస్తారు.
– ఇప్పుడున్న పరిశ్రమలన్నింటికీ, కొత్తగా వచ్చేవాటికీ వర్తింపజేసేలా
అధికారంలోకి రాగానే మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఓ చట్టం..తీసుకువస్తాం.
– అందులో75శాతం రిజర్వేషన్లు లోకల్ వారికే ఇవ్వాలని నిబంధనగా విధిస్తాం.
– దీంతో నిరుద్యోగ సమస్య పరిష్కరించవచ్చు.

ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

ఫొటో క్రెడిట్ : హేమ సుంద‌ర్ రాజు, వీడియోగ్ర‌ఫ‌ర్, సాక్షి ఛానెల్, శ్రీ‌కాకుళం