Andhra pradesh CM ఢిల్లీకి జగన్

86

Ap cm Delhi tour.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో అమిత్ షాను కలవనున్నారు జగన్.. అవకాశమిస్తే ప్రధాని మోడీని కూడా కలిసి వస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇక అమిత్ షా అపాయింట్మెంట్ కోరుతూ అధికారులు ఇప్పటికే లేఖ రాశారు. షా బుధవారం, లేదా గురువారం అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. షా అపాయింట్మెంట్ ను బట్టి జగన్ పర్యటన ఉంటుంది. అయితే గురువారం తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సుకు అమిత్‌షా హాజరు కావాల్సి ఉంది. అక్కడే ఆయనను కలవొచ్చునని సీఎం భావించారు. అయితే అమిత్‌ పర్యటన రద్దుతో.. ఆయన అపాయింట్‌మెంట్‌ కోరుతూ లేఖ రాశారు. అనుమతి రాగానే ఢిల్లీకి వెళ్లాలని జగన్‌ భావిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో కూడా అమిత్ షాను కలిశారు జగన్..

Andhra pradesh CM ఢిల్లీకి జగన్