గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ : – సీఎం జగన్

154

జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు కృషి చేస్తుంది. శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దీనిపై చర్చించారు జగన్. గ్రామాలకు అన్ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ అందించాలని, అంతరాయాలు లేకుండా నెట్‌వర్క్‌ అందించాలని అధికారులకు సూచించారు. ఎంత స్పీడ్ తో కనెక్షన్ కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

ఇటువంటి ఏర్పాట్లు చేయడం వలన ఉద్యోగలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు అనుకూలంగా ఉంటుందని వివరించారు. ఇక విద్యార్థులకు ఇవ్వనున్న ల్యాప్ టాప్స్ పైకూడా దృష్టిపెట్టాలని అధికారులకు తెలిపారు జగన్, వచ్చే ఏడాది అమ్మఒడి పథకం చెల్లింపులు చేసే సమయంలో ల్యాప్ టాప్ కావాలి అన్నవారికి ఇచ్చే విధంగా ముందుగానే తెచ్చిపెట్టాలని వివరించారు. ఒక వేళ ల్యాప్ టాప్ లో చెడిపోతే గ్రామా సచివాలయంలో రిపేర్ చేసి ఇచ్చేలా ఏర్పాట్లు చెయ్యాలని తెలిపారు. రిపేర్ కి వచ్చిన ల్యాప్ టాప్ వారం రోజుల్లో రిపేర్ చేసి ఇచ్చే విధంగా ఉండాలని ఆదేశించారు జగన్.