3 నెలల తర్వాత వెలుగులోకి జాక్‌ మా

339

జాక్ మా ఈ పేరు చాలామందికి సుపరిచితమే, చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడే ఈ జాక్ మా. ఈయన గత మూడు నెలలుగా కనిపించకుండా పోయారు. ఎప్పుడు మీడియాలో ఉంటూ పలు షోలలో కనిపించే మా మూడు నెలలు కనిపించకపోవడంతో చైనా ప్రభుత్వం అతడ్ని ఎదో చేసింది అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. చైనా బ్యాంకుల తీరును వ్యతిరేకించిన మా ను చైనా ఎక్కడో దాచి ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పత్రికలు కథనాలు ప్రచురించాయి.

వీరందరి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ జాక్ మా బుధవారం బయటకు వచ్చారు. బుధవారం గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కనిపించారు. గ్రామీణ ప్రాంత అక్షరాస్యులు సాధించిన విజయాలను ప్రశంసించారు. అయితే వ్యాపారంలోకి రాకముందు జాక్ మా ఇంగ్లీష్ టీచర్ గా పనిచేశారు మా. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మక్కువతో ప్రతి ఏడాది ఉపాధ్యాయులతో ఈ కార్యక్రమాన్ని దక్షిణ హైనాన్లోని సన్యాలో నిర్వహిస్తారు.

అయితే ఈ సంవత్సరం కోవిడ్ 19 కారణంగా ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగింది. త్వరలోనే వచ్చి కలుస్తాను అని వారికి తెలిపారు మా. జాక్ మా వీడియో కాన్ఫరెన్స్ కు చెందిన వీడియో ప్రస్తుతం వరాల గా మారింది. ప్రపంచ మీడియా మొత్తం జాక్ మా వీడియోను ప్రసారం చేసింది.

3 నెలల తర్వాత వెలుగులోకి జాక్‌ మా