రికార్డు సృష్టించిన జబర్దస్త్ రాఘవ

99

జబర్దస్త్ లో రాకెట్ రాఘవకు ఉన్న క్రేజే వేరు. విచిత్రమైన కథలను ఎంచుకొని స్కిట్స్ చేస్తుంటారు. కొన్ని నవ్వులు పూయించకపోయిన మంచి సందేశం మాత్రం ఇస్తాయి. అయితే రాఘవ మొదట సినిమాల్లో నటించాడు. అప్పుడు ఆయనకు అంత పేరు రాలేదు. ఎక్కడో ఓ మూలన ఆలా కనిపించి ఇలా వెళ్ళిపోయేవారు. కానీ జబర్దస్త్ కి వచ్చిన తర్వాత హాస్య ప్రేమికులకు దగ్గరయ్యారు. 2013 నుంచి జబర్దస్త్ లో చేస్తున్నాడు రాఘవ.

ఇక ఇప్పటివరకు 400 స్కిట్స్ చేశారట, జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క స్కిట్ కూడా మిస్ చెయ్యకుండా చేశాడట రాఘవ. ఇన్ని స్కిట్స్ చేసిన వారు జబర్దస్త్ లోనే లేరు. జడ్జిలు కూడా చాలా ఎపిసోడ్స్ డుమ్మాకొట్టారు కానీ రాఘవ మాత్రం ఒక్క స్కిట్ కూడా వదలకుండా చేశాడు. ఇక ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ టీం ఆయనకు సన్మానం చేసింది. జడ్జి రోజా సమక్షంలో టీం సభ్యులు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్బంగా టీం సభ్యులు రాఘవను జబర్దస్త్ కట్టప్పతో పోల్చారు.