రూ.1049 లకే ఐటెల్‌ ఫోన్‌ : ఫీచర్లు చూస్తే..

85

ఐటెల్‌ సంస్థ సరికొత్త ఫీచర్లు, అతి తక్కువ ధరలో కొత్త ఫీచర్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐటీ2192టీ థర్మో ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి వదిలింది. దీని ధరను కేవలం రూ .1,049గా నిర్ణయించింది. ఈ ఫోన్ ఇన్‌బిల్ట్‌ టెంపరేచర్‌ సెన్సర్‌ ద్వారా శరీర ఉష్ణోగ్రతను మానిటర్‌ చేస్తుందని కంపెనీ పేర్కొంది. కోవిడ్ -19 నుండి సురక్షితంగా ఉండటానికి ముందస్తు చర్యగా యూజర్ల శరీర ఉష్ణోగ్రతను ట్రాక్ చేస్తుందని తెలిపింది.

ఈ ఫోన్ లో టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్‌ అందుబాటులో ఉంది. తెలుగుతోపాటు మొత్తం ఎనిమిది భాషలకు ఈ ఫోన్ సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ పేర్కొంది. 4.5 సెం.మీ డిస్‌ప్లే, 1,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ బ్యాటరీ మోడ్‌తో 4 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ , వెనుక కెమెరా, రికార్డింగ్ ఆప్షన్‌తో వైర్‌లెస్ ఎఫ్‌ఎం, ఆటో కాల్ రికార్డర్, ఎల్‌ఈడీ టార్చ్, వన్-టచ్ మ్యూట్ , ప్రీ-లోడెడ్ గేమ్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.