దైవసేవ ముసుగులో అక్రమాలు.. రూ.120 కోట్లు సీజ్ చేసిన అధికారులు

139

పాల్ దినకరన్.. గతంలో ఉదయాన్నే ఏ టీవీ పెట్టిన ఈయన ప్రోగ్రామ్స్ వచ్చేవి. మంచి ప్రసంగికుడిగా దైవసేవకుడిగా పేరు పొందారు క్రైస్తవ పాస్టర్ పాల్ దినకరన్. ఆయన కార్యక్రమాలు చూసేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చే వారు. ప్రసంగాలు విని తరించేవారు. అయితే మంచి మాటలు చెప్పి, ప్రజలకు నీతులు బోధించిన దినకరన్ భారీగా అక్రమ ఆస్తులు కూడపెట్టినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. గత ఐదురోజులుగా పాల్ దినకరన్ కు చెందిన ఆస్తులపై ఐటీ అధికారులు సోదాలు చేశారు.

మొత్తం 28 చోట్ల సోదాలు చేసిన ఐటీ అధికారులకు సుమారు 120 కోట్ల రూపాయల లెక్కచూపని డబ్బు బయటపడింది. దీనిని సీజ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. కళాశాలకు సంబంధించి కూడా అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. అతడి ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలో తప్పుడు లెక్కలు బయటపడినట్లు అధికారులు గుర్తించారు. ఈయన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఇంతకాలం సంఘసేవకుడిగా ఉన్న దినకరన్ ఇంత మోసగాడా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇక డబ్బుతోపాటు 2.5 కోట్ల విలువ చేసే 4.5 కేజీల బంగారాన్ని కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఓ ఐటీ అధికారి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఇజ్రాయెల్ సహా మొత్తం 12 దేశాల్లోని పాల్ దినకరన్ కంపెనీలు, ట్రస్టుల్లో తనిఖీలు చేయాలనుకుంటున్నారు. పాల్ దినకరన్ కి 200కి పైగా బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు తెలిసింది.

రూ.120 కోట్లు సీజ్ చేసిన అధికారులు