తాప్సీ పన్ను ఇంటిపై ఐటీ అధికారుల దాడులు

170

బాలీవుడ్ హీరో అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్నుకు చెందిన ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన వికాశ్ భల్ ఇంటి వద్దకూడా బుధవారం తనిఖీలు చేస్తున్నారు. వీరితోపాటు మరికొందరు బాలీవూడ్ ప్రముఖుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపన్ను ఎగవేత కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఫాంథమ్ ఫిల్మ్స్‌తో పాటు 22 ప్రదేశాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తున్నది. పాకిస్థాన్ కు చెందిన బ్యాంకు అకౌంట్స్ నుంచి తాప్సీ వ్యక్తిగత బ్యాంకు అకౌంట్ కి నగదు ట్రాన్స్ఫర్ జరిగిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. గత నెలలో ఈ ట్రాంజక్షన్ జరిగినట్లు తెలుస్తుంది.

తాప్సీ పన్ను ఇంటిపై ఐటీ అధికారుల దాడులు