కరోనా వచ్చి ఏడాది పూర్తి

286

కరోనా మహమ్మారి ఫిబ్రవరి నెలలో దేశంలోకి ప్రవేశించింది. తెలంగాణకు మాత్రం మార్చిలో వచ్చింది. మార్చి 2 తేదీన మొదటి కరోనా కేసు నమోదైంది. ఆఫీస్ పనిమీద దుబాయ్ వెళ్లిన రామతేజ అనే వ్యక్తి ఫిబ్రవరి చివరి వారంలో హైదరాబాద్ వచ్చాడు. అయితే అతడు దుబాయ్ లోనే కరోనా బారిన పడ్డారు. కానీ అప్పటికి ఇంకా విమానాశ్రయాల్లో కరోనా టెస్టులు ప్రారంభం కాలేదు. ట్రాకింగ్ లో భాగంగా రామతేజ దుబాయ్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించి పరీక్షలు చేశారు. దింతో అతడికి కరోనా ఉన్నట్లుగా నిర్దారించారు. వెంటనే గాంధీలోని ప్రత్యేక వార్డుకు తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ మార్చి 12న కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక మార్చి 13 నుంచి కొత్త కరోనా మొదలయ్యాయి.. 2020 మార్చి నుంచి 2021 మార్చి వరకు సుమారు 3 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 1600 మంది కరోనాతో మృతి చెందారు.

కరోనా వచ్చి ఏడాది పూర్తి