సీఎం జగన్ పై అలిగిన ‘ఐటీ గ్రిడ్’ కేసు కీలకసూత్రధారి?!

555

ఐటీ గ్రిడ్ అనే సాఫ్ట్ వేర్ సంస్థ ఏపీ ప్రభుత్వ డేటా చోరీ చేసిందా?.. ప్రభుత్వం దగ్గరుండే ప్రజల ఆధార్, ఓటర్ లిస్ట్, ప్రజల బ్యాంకు ఖాతాల నంబర్లు, ఇతర ప్రజల సర్టిఫికెట్లు, ప్రజల నుండి లబ్ది పొందిన లబ్ధిదారుల లిస్టు వంటి డేటా ఐటీ గ్రిడ్ సంస్థ వద్ద ఉందని సాధారణ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఐటీ గ్రిడ్ సంస్థ చేత ఈ డేటా చోరీ చేసిందని అప్పటి ప్రతిపక్ష వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసును తీవ్రంగా పరిగణించగా ఆ సంస్థ మూతపడడంతో పాటు సంస్థ ఎండీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయే వరకు వచ్చింది.

ఆ సమయంలో ఐటీ గ్రిడ్ టీడీపీ అఫీషియల్ యాప్ డెవలప్, మెయిన్ టైన్ చేస్తుంది. అప్పుడు డేటా చోరీ అని అంత దుమారం రేగినా చివరికి అలాంటిది ఏమీ లేదని తేలింది. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. అయితే.. ఆ ఐటీ గ్రిడ్ కేసులో కీలక సూత్రధారి తుమ్మల లోకేశ్వర్ రెడ్డి. ఈయన హైదరాబాద్ లో నివాసముంటూ ఏపీ ప్రజల డేటా లీక్ చేసిందని ఐటీ గ్రిడ్ మీద కేసు పెట్టారు. ఒకవిధంగా ఆ కేసును వెనకుండి నడిపించింది లోకేశ్వర్ రెడ్డే. ఆ కేసులో టీడీపీ ఎంత నష్టం జరిగిందన్నది విడదీసి లెక్కలేయలేం కానీ టీడీపీ పరాజయంలో అది కూడా ఎంతో కొంత పాత్ర పోషించింది.

ఈ లోకేశ్వర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువే. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన లోకేశ్వర్ రెడ్డి ఐటీ గ్రిడ్ కేసుతో ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. ఒకవిధంగా వైసీపీకి ఫేవర్ చేసినందుకు గాను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అనంతరం ఐటీ సలహాదారుగా పదవి ఇచ్చారు. అయితే.. లోకేశ్వర్ రెడ్డికి ఒక కోరిక ఉంది. కమలాపురంలోని ఆయన స్వగ్రామంలో రాజకీయం.. అధికారం తన కుటుంబానికి ఉండాలన్నది ఆయన అభిమతం. దానికోసమే గతంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు లోకేశ్వర్ రెడ్డి అన్న భార్య చేత నామినేషన్ వేయించారు.

కానీ ఆ ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అడ్డుపడ్డారు. ఎమ్మెల్యే కల్పించుకుని సర్పంచ్ పదవి ఇస్తామని చెప్పి ఎంపీటీసీ ఎన్నికల నుండి నామినేషన్ విత్ డ్రా చేయించారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చే సరికి రవీంధ్రనాథ్ ప్లేట్ ఫిరాయించి తన అభ్యర్థిని నిలబెట్టారు. దీంతో నొచ్చుకున్న లోకేశ్వర్ రెడ్డి ఐటీ గ్రిడ్ కు ప్రతిఫలంగా ఇచ్చిన ఐటీ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. కాగా.. ఈ వివాదం ఇప్పుడు వైసీపీ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. లోకేశ్వర్ రెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి ఇద్దరూ సీఎంకు బంధువులే. ఎవరికి సర్దిచెప్పడానికి అవకాశం లేకపోవడంతో పార్టీ పెద్దలు సైలెంట్ అయిపోయారట. ఫైనల్ గా ఈ వివాదం జగన్ వద్దే తేలనుందని చెప్తున్నారు.

సీఎం జగన్ పై అలిగిన ‘ఐటీ గ్రిడ్’ కేసు కీలకసూత్రధారి?!