ఐపీఎల్ లో భారీ ధర పలికిన ఆటగాళ్లు.. యువరాజ్ రికార్డు బ్రేక్..

137

చెన్నై వేదికగా 2021 ఐపీఎల్ వేలం జరిగింది. ఈ ఏడాది వేలంలో భారీ ధరలకు అమ్ముడుపోయారు ఆటగాళ్లు. ఎవరు ఊహించని రీతిలో వేలం జరిగింది. ఇక ఈ ఐపీఎల్ లో అనూహ్యంగా దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను అత్యధిక ధర రూ. 16.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్ చరిత్రలో ఇదే భారీ మొత్తం కావడం గమనార్హం. క్రిస్ మోరిస్ గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన రికార్డు యువరాజ్ పేరున ఉంది. ఆయన 2015 ఢిల్లీ క్యాపిటల్స్ 16 కోట్లకు దక్కించుకుంది.

ఇక ఈ ఏడాది ఆ రికార్డ్ బ్రేక్ అయింది. కాగా క్రిష్ మోరిస్ బేస్ ప్రైస్ రూ. 75 లక్షల నుంచి రూ. 16.25 కోట్ల వరకు పలికిన మోరిస్‌ను చివరికి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అటు మ్యాక్స్‌వెల్‌ను రూ. 16,25 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ దక్కించుకుంది. ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మళ్లీ జాక్‌ పాట్‌ కొట్టేశాడు. RCB అతడిని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.5 కోట్ల నుంచి చెన్నై, బెంగళూరు అతడిని దక్కించుకొనేందుకు విపరీతంగా పోటీపడ్డాయి. చెన్నై వద్ద తక్కువ మొత్తమే ఉండటంతో రూ.14 కోట్ల వరకు ప్రయత్నించి చివరకు వదిలేసింది.

ఐపీఎల్ లో భారీ ధర పలికిన ఆటగాళ్లు.. యువరాజ్ రికార్డు బ్రేక్..