స్త్రీలలో సంతాన లేమి సమస్యలు

104
Infertility problems in women

స్త్రీలలో సంతానలేమికి ప్రధానంగా అండాశయ సంబంధిత కారణాలు ఎక్కువగా ఉంటాయి. అండాశయం నుండి అండాలు విడుదల కాకపోవడం, అందువలన హార్మోన్ల సమతుల్యత దెబ్బ తినడం, పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతుంది… అండం విడుదలవ్వని కారణంగా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు.. ఇలాంటి సమస్య ఎటువంటి స్త్రీలలో ఉంటుంది అంటే..

ప్రధానంగా అండం విడుదలలో లోపానికి పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ (పిసిఓడి) కారణం. పిసిఓడి ప్రాబ్లం.. అత్యధిక శాతం స్త్రీలను వేదిస్తున్న సంతానలేమి సమస్య ఈ పిసిఓడి. ప్రతి ఐదుగురిలో ఒక్కరు ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. వీటిని అండాశయంలో నీటి బుడగలుగా వ్యవహరిస్తుంటారు. ఇది అండాశయ సంబంధిత కారణాలలో ప్రధానమైనది. శరీర ఆకృతిలో మార్పుల తోపాటు మానసిక లక్షణాలలో మార్పులు చోటు చేసుకోవడం ఈ సమస్య ప్రధాన లక్షణం. దీనికి ట్రీట్‌మెంట్ గా కొంతకాలం హార్మోన్ ట్యాబ్లెట్లు ఉపయోగించమని, తగ్గకపోతే లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. అయితే లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించుకున్న తరువాత కూడా ఈ సమస్య తలెత్తిన మహిళలు చాలా మంది ఉన్నారు. పిసిఓడి వలన నెలసరి సక్రమంగా రాకపోవడం, అండం సక్రమంగా విడుదల కాకపోవడం వలన గర్భం దాల్చకపోవడం జరుగుతుంది. పిసిఓడి పూర్తిగా నయం కావాలంటే నెలల సమయం పడుతుందటున్నారు ఆరోగ్య నిపుణులు.

సాధారణంగా గర్భాశయానికి ఇరువైపులా ఒక్కొక్కటి చొప్ప్పున రెండు అండాశయాలు ఉంటాయి. గర్భాశయానికి, గర్భాశయ వాహికలకు దగ్గరగా గర్భాశయం వెలుపల ఇవి ఉంటాయి. ఈ రెండు అండాశయాలు సుమారుగా 3 సెం.మీ. పొడవు, 2 సె.మీ, వెడల్పు.. 1 సెం. మీ మందంతో ఉంటాయి. వ్యాధికి గురైన తర్వాత ఈ రెండు అండాశయాల పరిమానం పెరిగి మందంగా ఉంటుంది, అంతేకాదు కవచంలా ఏర్పడి పొరలు పొరలుగా ఉండి సిస్ట్‌ లుగా మారుతుంది. ఈ సిస్ట్‌ ల సైజు 1 మి.మీ నుంచి 20 మి. మీ వరకు ఉంటాయి. ఈ సిస్ట్‌ ల వలన దాదాపు 30 శాతం మంది మహిళలు సంతానలేమికి గురవుతున్నారు.

వ్యాధి లక్షణాలు:

*రుతుక్రమంలో మార్పులు చోటు చేసుకుంటాయి.

*మొదటగా పీరియడ్స్ సక్రమంగా వస్తున్నప్పటికీ క్రమంగా 3 నెలల నుంచి 6 నెలల వరకు రాకుండా ఆగిపోతాయి.

* అంతేకాదు రుతుస్రావం చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది.

*ప్రతినెలా అండాశయం నుంచి విడుదల కావాల్సిన అందం విడుదల అవ్వదు.

*అధిక బరువు