నానమ్మ (ఇందిరా) ఎమెర్జెన్సీ విధించడం ముమ్మాటికీ తప్పిదమే :- రాహుల్ గాంధీ

164

దేశంలో అత్యవసర స్థితి విధించాలని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయం తప్పిదమేనని కాంగ్రెస్ నేత వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, మంగళవారం ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ కౌశిక్ బసుతో మాట్లాడుతూ అన్నారు. ఈ సందర్బంగా అనేక విషయాలపై ఆయన చర్చించారు. దేశ ఆర్థిక పరిస్థితి, స్థితిగతులపై గంటకుపైగా చర్చించారు..

తన నానమ్మ 1975, 1977 మధ్య 21 నెలలు ఎమర్జెన్సీ విధించడం పెద్ద తప్పిదం అని తెలిపారు. ఆ సమయంలో మీడియాను, పత్రికలను నిషేదించారని, ఇందిరను ఎదిరించిన వారిని జైల్లో పెట్టారని రాహుల్ వ్యాఖ్యానించారు. అవి చీకటి రోజులే అని ఆయన తెలిపారు. నాటి రోజులు నేటి రాజకీయపార్టీలు జీవితకాలం విమర్శించేందుకు స్టఫ్ దొరికిందని అన్నారు.

ఇక ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై కూడా ఆర్ఎస్ఎస్ ను ప్రభుత్వ సంస్థల్లోకి చొప్పిస్తోందని కౌశిక్ కు తెలిపారు. ఈ విషయాన్నీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు చెప్పడం చాలా బాధగా అనిపించిందని తెలిపారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సీఎం గా ఉన్న సమయంలో ఓ అధికారి తన మాటలు వినకుండా ప్రవర్తించినట్లు తన దృష్టికి తెచ్చారని రాహుల్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. వ్యవస్థల్లో ఆర్ఎస్ఎస్ చేరడం వలన ప్రతిపక్ష పార్టీల పనులు కావడం లేదని వివరించారు.

ఇక త్వరలో జరగబోయే ఎన్నికలపై రాహుల్ గాంధీ స్పందించారు. పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన వివాదాలపై స్పందించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పొత్తు విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి మధ్య మాటామాటా వచ్చింది. ఆనంద్ శర్మ జీ-23లో భాగం, ఆ బృందంలోని చాలామంది నేతలు పార్టీ అగ్ర నాయకత్వంపై కోపంగా ఉన్నారు అని రాహుల్ అన్నారు.

నానమ్మ (ఇందిరా) ఎమెర్జెన్సీ విధించడం ముమ్మాటికీ తప్పిదమే :- రాహుల్ గాంధీ