భారత్ లో కరోనా కేసులు @ కోటి..

92

భారతదేశ కరోనావైరస్ కేసుల సంఖ్య శనివారం నమోదైన 25 వేల కేసులతో కలిపి 1 కోటి మార్కును దాటింది. ప్రస్తుతం భారత్ లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,00,04,599 కు చేరుకుంది. అదేసమయంలో కోవిడ్ -19 మరణాల సంఖ్య కూడా 1,45,136 కు పెరిగింది. కోటికి పైగా కేసులలో, మొత్తం కోలుకున్న కేసుల సంఖ్య 95,50,712 కాగా, క్రియాశీల కేసుల సంఖ్య 3,08,751గా ఉంది.

భారత్ లో కరోనా రికవరీ రేటు భారీగా పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మేలో 50,000 తో మొదలై.. డిసెంబర్ లో 95 లక్షలకు పైగా నమోదు అయ్యాయని. ప్రస్తుతం మొత్తం కేసులలో 3.14% మాత్రమే ఉన్నాయని తెలిపారు. డిసెంబర్ 18 వరకు మొత్తం 16,00,90,514 నమూనాలను పరీక్షించామని, డిసెంబర్ 18 నుంచి 11,71,868 నమూనాలను పరీక్షించామని ఐసిఎంఆర్ తెలిపింది.

భారత్ లో ప్రస్తుతం ఆరు కరోనావైరస్ వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని.. ఈ టీకాలు – కోవాక్సిన్‌ను ఐసిఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తుండగా, రెండవది జైడస్ కాడిలా అభివృద్ధి చేసింది, మూడవది జెన్నోవా, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది.. అలాగే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను తయారు చేస్తుంది..హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, రష్యాకు చెందిన గమలేయ నేషనల్ సెంటర్ సహకారంతో రూపొందిన ఆరవ వ్యాక్సిన్ ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్నాయని ఐసిఎంఆర్ వెల్లడించింది.