దేశ ప్రజలకు స్వదేశీ టీకా – మోడీ

65

కరోనా మహమ్మారిని పారదోలేందుకు దేశం సిద్దమవుతుంది. త్వరలో దేశ ప్రజలకు కరోనా టీకా ఇవ్వనున్నారు. స్వదేశంలో తయారు చేసిన టీకానే దేశ ప్రజలకు ఇవ్వనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. గురువారం గుజరాత్ రాజ్ కోట్ ఎయిమ్స్ ఆసుపత్రి శంకుస్థాపనలో భాగంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వదేశీ టీకా ఇస్తున్నట్లు తెలిపారు.

జనవరి నెలలో టీకా పంపిణి ప్రారంభం అవుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతుందని ప్రధాని తెలిపారు. వ్యాక్సిన్ పంపిణికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. వ్యాక్సిన్ పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. వైద్య విద్య అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు ప్రధాని

ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని, భారత్ ప్రపంచ ఆరోగ్య కేంద్రంగా మారుతుందని తెలిపారు మోడీ. పేదల వైద్యం కోసం ఆయుష్మాన్ భారత్ తీసుకురావడం జరిగిందని, పేద ప్రజలకు జన ఔషధ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. జన ఔషధ కేంద్రాల్లో 90 శాతం తక్కువ ధరలకే మందులు లభిస్తున్నాయని తెలియచేశారు మోడీ.

దేశంలో కొందరు తమ వ్యక్తిగత స్వార్ధం కోసం పుకార్లు పుట్టిస్తున్నారని, వ్యాక్సిన్ పంపిణీపై అటువంటి పుకార్లే వచ్చే అవకాశం ఉందని తెలిపారు మోడీ. కోవిద్ పై పోరు అంటే కనిపించని శత్రువుతో యుద్ధం చేయడమని తెలిపారు.