చైనా సైనికులను తరిమికొట్టిన భారత జవాన్లు.. 20 మందికి గాయాలు

243

సరిహద్దుల్లో దురుసుగా ప్రవర్తిస్తున్న చైనాకు భారత జవాన్లు తగిన బుద్ది చెబుతున్నారు. విస్తరణ వాదంతో దేశ సరిహద్దుల్లో తిష్టవేసి భారత జవాన్లను రెచ్చగొడుతున్న చైనా సైనికులను సరిహద్దుల అవతలికి తరిమికొడుతున్నారు మన సైనికులు. తాజాగా భారత భూభాగంలోకి ప్రవేశించి రచ్చ చేసిన చైనా సైనికులపై తిరగబడ్డారు భారత జవాన్లు, వారిని సరిహద్దులు దాటించారు. ఈ దాడిలో 20 మంది చైనా సైనికులకు గాయాలు అయినట్లు సమాచారం.

భారత్ భూభాగంలోకి వచ్చిన చైనా సైనికులకు మొదట శాంతంగా చెప్పారు భారత జవాన్లు, అయితే చైనా సైనికులు వెనక్కు పోమని దుర్భాషలాడారు. ఓ జవాన్ పై చెయ్యి చేసుకున్నారు. దింతో తిరగబడిన భారత ఘటక్ సైనికులు సరిహద్దుల అవతలకు వరకు తరిమినట్లు సమాచారం. చైనా సైనికుల్లో పలువురికి కాళ్ళు చేతులు విరిగినట్లు తెలుస్తుంది. ఇక భారత వైపు నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటన సిక్కింలోని నాకూ లాలో గత వారం జరిగింది.

చైనా సైనికులను తరిమికొట్టిన భారత జవాన్లు