భారత్ vs ఇంగ్లాండ్.. టెస్ట్ జట్టును ప్రకటించిన భారత్

157

భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగనుంది. మొదటి టెస్ట్ ఫిబ్రవరి 5 తేదీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే మొదటి రెండు టెస్టులకు టీంను ఎంపిక చేశారు సెలెక్టర్లు కోహ్లీ (c), రోహిత్ శర్మ, మయాంక్, గిల్, పూజారా, రహానే(vc), కేఎల్ రాహుల్, పాండ్యా, పంత్ (wk), సాహా (wk), అశ్విన్, కుల్దీప్, సుందర్, ఇషాంత్ శర్మ, బుమ్రా, సిరాజ్, శార్దుల్. కాగా ఈ సిరీస్ లో ఇశాంత్ కు స్థానం కల్పించారు.

మొత్తం నాలుగు టెస్టుల ఈ సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరగనుంది. సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు జరుగుతుంది. మూడో టెస్ట్ ఫిబ్రవరి 24 నుంచి 28 మధ్య జరుగుతుంది. ఇక చివరి టెస్ట్ మార్చి 4 నుంచి 8 మధ్య జరగనుంది. మూడవ టెస్ట్ మ్యాచ్ డే అండ్ నైట్ పద్దతిలో ఆడనున్నారు. ఈ సిరీస్ కు భారత్ ఆతిధ్యం ఇస్తుంది. ఈ టెస్ట్ సిరీస్ లో హైదరాబాద్ కుర్రాడు సిరాజ్ కు స్థానం దక్కింది. ఆస్ట్రేలియా టూర్ లో రాణించిన వారిని ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ లకు ఎంపిక చేశారు.

భారత్ vs ఇంగ్లాండ్.. టెస్ట్ జట్టును ప్రకటించిన భారత్