విజయానికి 127 పరుగుల దూరంలో భారత్

795

సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ 5వ రోజు ఆటలో రెండో సెషన్ ముగిసింది. విజయానికి 127 పరుగుల దూరంలో టీంఇండియా ఉంది. 5వ రోజు ఆట ముగిసే సమయానికి 280 పరుగులు చేసింది భారత్, ఇంకా ఐదు వికెట్లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం అశ్విన్, విహారి బ్యాటింగ్ లో ఉన్నారు. అశ్విన్ 7 పరుగులు చెయ్యగా, విహారి 4 పరుగులు చేశాడు.

36 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఈ టెస్ట్ లో ఎవరు విజయం సాధించినా 2 – 1 తో సిరీస్ లో ఆధిక్యం సాధిస్తారు. డ్రా అయితే 1-1 తో ఉంటారు. పరుగుల ఛేదనలో భారత్ ఆల్ అవుట్ అయితే విజయం ఆస్ట్రేలియా సొంతం అవుతుంది. 127 పరుగులు సాధిస్తే భారత్ తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంటుంది. బ్యాటింగ్ లో ఉన్న అశ్విన్, విహారి రాణిస్తే భారత్ విజయం సాధించడం కష్టమేమీ కాదు. ఒకవేళ వీరిలో ఎవరైనా అవుట్ అయితే మాత్రం విజయావకాశాలు సన్నగిల్లే అవకాశం ఉంది.