భారత్ లో 6 కరోనా స్ట్రెయిన్ కేసులు.. కేంద్రం ప్రకటన

50

భారత్ లోకి స్ట్రెయిన్ కరోనావైరస్ ప్రవేశించింది. ఇటీవలే యుకె నుండి భారత్ కు తిరిగి వచ్చిన ఆరుగురు వ్యక్తులు కొత్త కరోనావైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్నీ కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. బెంగళూరులో 3, హైదరాబాద్ లో 2 , పూణేలో 1 కేసు నమోదు అయిందని కేంద్రం వెల్లడించింది. కాగా స్ట్రెయిన్ కరోనా సోకిన వారిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఉంచినట్టు పేర్కొంది. వారితో కాంటాక్ట్ వున్నవారికోసం సమగ్ర కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తోంది. కాగా ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించింది.