పాక్ కి కరోనా వ్యాక్సిన్ ఇస్తాం :- భారత్.

602

భారత్ కరోనా మహమ్మారిని తరిమే వాక్సిన్ తయారు చేసిన విషయం విదితమే.. జనవరి 16 నుంచి దేశం మొదటి విడత కరోనా డ్రైవ్ నడుస్తుంది సుమారు 15 లక్షల మంది ఇప్పటికే టీకా తీసుకున్నారు. ఇక భారత్ టీకా కోసం ప్రపంచ దేశాలు క్యూ కడుతున్నాయి. బ్రెజిల్ కు భారత్ 20 లక్షల డోస్ లను పంపింది. భారత్ చుట్టూ ఉన్న దేశాలకు కూడా వాక్సిన్ పంపుతుంది. ఇప్పటికే మయన్మార్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు కరోనా వాక్సిన్ చేరింది.

మారిషెస్, శ్రీలంకలకు రేపటివరకు చేరే అవకాశం ఉంది. అయితే పాకిస్థాన్ కు వాక్సిన్ ఇచ్చేందుకు భారత్ సిద్దమే అని భారత విదేశాంగ శాఖా తెలిపింది. మహమ్మారిని తరిమేందుకు శత్రుత్వాన్ని పక్కన పెడతామని పేర్కొంది. కానీ పాకిస్థాన్ వాక్సిన్ కావాలని భారత్ ను అడిగేలా లేదని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇప్పటికే చైనా వాక్సిన్ పాకిస్థాన్ కి చేరి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ పాక్ భారత్ ను కోరితే తప్పకుండ వాక్సిన్ పంపుతామని విదేశాంగ శాఖా అధికారులు తెలిపారు. భారత్ లక్ష్యం ప్రపంచం నుంచి కరోనాని పారదోలడమని అది మిత్ర దేశమా శత్రు దేశమా అనే విషయం పక్కన పెట్టి సాయం చేస్తామని తెలిపారు.

పాక్ కి కరోనా వ్యాక్సిన్ ఇస్తాం :- భారత్.