ప్రపంచానికి వ్యాక్సిన్ అందించే సత్తా భారత్ సొంతం: ప్రధాని మోడీ

238

యావత్ ప్రపంచానికి వ్యాక్సిన్ అందించే సత్తా భారత్ సొంతమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సోమవారం రాజ్య‌స‌భ‌లో ప్ర‌సంగించిన ఆయన.. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా రిప్లై ఇచ్చారు. భార‌త్‌పై ప్ర‌తి ఒక్క‌రి అంచ‌నాలు పెరిగాయ‌ని చెప్పారు. ప్రపంచం కోసం ఇండియా ఏదైనా చేస్తుంద‌న్న విశ్వాసం వారిలో పెరిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. భార‌త్ నిజంగానే అవ‌కాశాలు క‌ల్పించే నేల అని, అనేక అవ‌కాశాలు ఎదురుచూస్తున్నాయ‌ని, ఉత్సాహాంతో ఉర‌క‌లేస్తున్న ఈ దేశం.. ఎటువంటి అవ‌కాశాల్ని వ‌ద‌లిపెట్ట‌ద‌ని ఆయ‌న అన్నారు.

ధ‌న్య‌వాద తీర్మానంపై రాజ్య‌స‌భ‌లో 50 మంది ఎంపీలు మ‌ట్లాడార‌ని, సుమారు 13 గంట‌ల పాటు వారి అభిప్రాయాల‌ను వెలిబుచ్చార‌ని, వారంతా త‌మ అమూల్య‌మైన అభిప్రాయాల‌ను వెల్ల‌డించార‌ని, ఆ ఎంపీలంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు మోడీ తెలిపారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో దీపాలు వెలిగించిన ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ ఆ ఘ‌ట‌న‌ల‌ను కొందరు వెక్కిరించార‌ని ప్ర‌ధాని అన్నారు. పోలియో, మ‌సూచీ లాంటి వ్యాధులు ఇండియాలో తీవ్ర ఉత్పాతాన్ని సృష్టించాయ‌ని, ఆ రోజుల్లో వ్యాక్సిన్ ఎవ‌రికి అందుతుందో తెలియ‌లేద‌ని, కానీ ఇప్పుడు మ‌న దేశం యావ‌త్ ప్ర‌పంచం కోసం వ్యాక్సిన్లు త‌యారు చేస్తున్నద‌ని, ఇది మ‌న ఆత్మ‌స్థైర్యాన్ని పెంచుతున్న‌ద‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు.

ప్రపంచానికి వ్యాక్సిన్ అందించే సత్తా భారత్ సొంతం: ప్రధాని మోడీ