కేంద్ర మాజీ హోం మంత్రి కన్నుమూత

108

కేంద్ర మాజీ హోం మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు సింగ్. శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. బూటాసింగ్ మరణం పట్ల ప్రధాని మోడీతో పాటు పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలు, పేదల సంక్షేమానికై గళమెత్తిన, అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయామని మోడీ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.

కాగా బూటాసింగ్ 1984–1986 మధ్య కేంద్ర వ్యవసాయ శాఖామంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిగా పనిచేశారు. 1986 నుంచి 89 వరకు కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. 2004 , 2006 మధ్య బీహార్ గవర్నర్ గా పనిచేశారు. తన పూర్తి జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకే అంకింతం ఇచ్చారు బూటాసింగ్. సింగ్ 1934 లో పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. బూటాసింగ్ మంచి విద్యావంతుడు. ఇయ్యన పీహెచ్డీ చేశారు.