మరో వివాదంలో దేవళ్ల రేవతి.. ఆసుపత్రి సిబ్బందిపై దాడి

97

దేవళ్ల రేవతి పేరు మారుమోగుతోంది. టోల్ ప్లాజా సిబ్బందితో గొడవపడిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా గుంటూరు జిల్లా దాచేపల్లి లోని ఓ నర్సింగ్ హోమ్ లో దేవళ్ళ రేవతి మేనల్లుడు అక్కడి సిబ్బంది మీద చేయి చేసుకున్నట్లు సమాచారం. అక్కడ వైద్యం చేయించుకున్నాక సిబ్బంది బిల్లు కట్టమని కోరారు. అయితే ఇంత బిల్లు అయిందా అంటూ ఆమె అల్లుడు వడియా రాజు నర్సింగ్ హోమ్ సిబ్బందితో గొడవకు దిగినట్లు సమాచారం.

అంతే కాదు ఇక్కడ రేవతి పేరు కూడా వాడారని, నర్సింగ్ హోమ్ నిర్వాహకులను బెదిరించినట్లు సమాచారం. కాగా సదరు వ్యక్తి ప్రవర్తనపై నర్సింగ్ హోమ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

మరో వివాదంలో దేవళ్ల రేవతి.. ఆసుపత్రి సిబ్బందిపై దాడి